lide

Ticker

6/recent/ticker-posts

డయాబెటిస్ లక్షణాలు

మధుమేహంలో మూడు రకాలు కలవు

 💊టైప్ 1 మధుమేహం.

💊 టైప్ 2 మధుమేహం / Type -2 Diabetes.

💊 గెస్టెషనల్ డయాబెటిస్ / గర్భధారణ సమయ మధుమేహం.

టైప్ 1 మధుమేహం: కొందరిలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. వీరికి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని టైప్ 1 డయాబెటిస్ అంటారు. ఇది చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది.

టైప్ 2 మధుమేహం: వివిధ కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత కాదు. పాంక్రియాస్, ఇన్ఫెక్షన్స్ వల్లగాని, ఆహార నియమాలు సరిగా లేకపోవడం చేత, క్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల టైప్ 2 మధుమేహం వస్తుంది.

గెస్టెషనల్ డయాబెటిస్ / గర్భధారణ సమయ మధుమేహం (Gestational Diabetes ): గర్భవతుల్లో 2 నుంచి 5 శాతం వరకు ఈ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిస్‌కు సరిగా వైద్యం అందించకపోతే తల్లీ, బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రసవం తర్వాత డయాబెటిస్ ఉండవచ్చు.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తమ బరవును ఎప్పటి కప్పుడు BMI ద్వారా చూసుకోవాలి (BMI = kg/m2). టైపు -2 మధుమేహులలో అధిక బరువు ఉండటం అత్యంత ప్రమాదకరం. బరువు శాతం పెరుగుతున్న కొద్ది డయాబెటిస్ సమస్య రెట్టింపు అవుతున్నట్లుగా భావించాలి. మన కార్యక్రమాల వలన 5 శాతం బరువు తగ్గిన కూడా మధుమేహం అదుపులో ఉన్నట్లే. కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, బరువును తగ్గించుకోవటంలో తోడ్పడతాయి.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎప్పుడు చలాకీగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మందగొడిగ ఉంటే వ్యాధి ఇంక పెరుగుతూ ఉంటుంది . చురుకుగా పని చేయడం వల్ల శరీరం కూడా హార్మోన్లను కావలసిన విధంగా వినియోగించి చురుకుదనాన్ని పెంచుకోగలుగుతుంది. రోజు అరగంట వ్యాయామం చేస్తే డయాబెటిస్ వలన సంభవించే ప్రమాదాలను నియంత్రించుకోవచ్చు . వ్యాయామం ద్యారా ఇన్సులిన్ యొక్క పని విధానం మెరుగై కణజాలంలోకి చక్కెర గ్రహించబడుతుంది. 45 సం" ఫై బడిన ప్రతిఒక్కరూ, డయాబెటిస్ వచ్చే అవకాశాలు కలిగిన యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి వలన రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెరుగుతుంది .కనుక సమయం దొరికినప్పుడల్ల శ్వాససంబంధ వ్యాయామం చేస్తే ఆందోళనను, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తద్వారా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.
మధుమేహంతో బాధపడుతున్న వారు, ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ పరీక్షించుకోవడం ఉత్తమం. ఈ మధుమేహ నియంత్రణా చర్యలలో భాగంగా సరైన పద్ధతుల గురించిన అవగాహన లేకపోతే అనేక ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. ఒక్కోసారి ప్రాణాoతకాలుగా మారే అవకాశాలు లేకపోలేదు. 

💊"లక్షణాలు":

  •  పాలీయూరియా / Poly Urea (అతిగా మూత్రం రావడం)
  •  పాలీడిప్సియా / Poly Dypsia (దాహం వేయడం),
  •  పాలీఫాజియా / Poly Phagia  (అతిగా ఆకలి వేయడం),
  • కొద్ది సమయంలోనే గుర్తించదగిన బరువు తగ్గడం,
  •  అలసట నీరసం కలగడం,
  • చూపు మందగించడం,
  • లైంగిక సమస్యలు రావడం,

💊కారణాలు:

  • అతిగా పాలుత్రాగడం మరియు పాల ఉత్పత్తులు భుజించడం,
  • క్రొత్తగా పండిన ధాన్యాలను వంటలలో వాడడం,
  • తాజాగా చేసిన సురను (మధువును) సేవించడం,
  • అతిగా నిద్ర పోవడం, శరీరశ్రమ కావలసినంత చేయకపోవడం,
  • మానసిక ఆందోళన,
  • భారీ కాయం,
  • అహారపు అలవాట్లు,
  • ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం,
  • ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం మరియు అతిగా ఆహారం తీసుకోవడం,
  • వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
  • గంటల తరబడి కూర్చోని ఉండటం,
  •  పోషకపదార్థాలు సరిగా లేని ఆహారం తీసుకోవడం,
  • వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోవడం, 
  • మాంసాహారం అధికంగా తీసుకోవడం, 
  • బేకరీ పదార్థాలు, తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం,
  • నిల్వ వుండే పచ్చళ్ళు తీసుకోవడం,
  • కొన్ని రకాల మందులు అధికంగా తీసుకోవడం వల్ల,
  •  స్టెరాయిడ్స్ ( Steroids ) కారణంగా,
  • కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్ కారణంగా,
  • హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం వస్తుంటుంది.

💊  జాగ్రత్తలు:

  • రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
  •  శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
  • భోజనానికి అరగంట ముందు వైద్యులు సూచించిన మందులు వేసుకోవాలి. 
  • ముందులు వేసుకోవడం మాత్రమే కాదు. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి.
  •  సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.
  • ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.
  • ఇన్సులిన్‌ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి.
  • మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి.
  • స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.
  • పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి.
  • గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి.
  • పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
  • ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి.
  • అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్‌ సలహా మేరకు చేయించుకోవాలి.
  • మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. 
  • దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది.
  • అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్‌ ఉందా లేదా కనుగొనాలి.
  • మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని కొనిపోయే కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది.
  •  అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్‌ పరీక్షలు చేయించుకోవడం అవసరం. 
  • అలాగే కొలెస్ట్రాల్‌ పరిమాణాన్ని తెలిపే లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించాలి.

💊 ఆహారం:

  • ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
  • రక్తంలో త్వరగా కరిగిపోయే పీచుపదార్థాలను కలిగి సోడియం ,కొలెస్ట్రాల్ లేని జామపండు మధుమేహ వ్యాధిగ్రస్థులు తినతగిన పండ్లలో ఒకటి.
  • నేరేడు పళ్ళు కూడా చాలా మంచిది.
  • దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు ఇన్సులిన్ తీసుకొనే వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుంది
  • చక్కర లేని కాఫీ తీసుకోవటం మంచిది.
  • తక్కువ పిండి పదార్థాలు గలిగిన ఆహారం తీసుకోవడం మంచిది.
  • అధిక పీచు పదార్థం గల ఆహారం బీన్స్‌, బ్రకోలీ, పాలకూరలను రోజూ తీసుకోవటం చాలా అవసరం.
  • ఒక టీ స్పూన్‌ మెంతులను అర కప్పు నీళ్లలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తాగాలి.
  • డయాబెటిక్‌ పేషెంట్లు తొక్కతోసహా తినగల పండ్లను ఎంచుకోవాలి. కారణం, తొక్కలో ఫైబర్‌ ఉంటుంది. అది పండ్లలోని కార్బొహైడ్రేట్లు చక్కెరగా మారే క్రమాన్ని నెమ్మదించేలా చేస్తుంది.
  • బ్లడ్‌ షుగర్‌ నియంత్రణలో బాదంపప్పు తోడ్పడుతుంది.
  • అందరిలా రోజుకు మూడు పూటలు కాకుండా, తక్కువ మోతాదులోనైనా సరే ఏడెనిమిది సార్లు తినాలి. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండకూడదు.
  • ఎక్కువగా శాఖాహార ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. 


Post a Comment

0 Comments